Stock Market News : ఆల్ టైమ్ హైకి నిఫ్టీ.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ 

స్టాక్ మార్కెట్ బూమ్ లో ఉంది. వరుసగా లాభాల్లో దూసుకుపోతోంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 23న మార్కెట్ ప్రాంభమైన వెంటనే నిఫ్టీ 22,297 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. Hdfc షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి 

Nifty Boom: నిఫ్టీ తగ్గే ఛాన్సే లేదట.. డిసెంబర్ నాటికి రికార్డ్ స్థాయి గ్యారెంటీ అంటున్న నిపుణులు 
New Update

Stock Market Boom : ఈరోజు, వారంలో చివరి ట్రేడింగ్ రోజున అంటే ఫిబ్రవరి 23న, స్టాక్ మార్కెట్ బూమ్‌(Stock Market Boom) ను చూస్తోంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ(Nifty) 22,297 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. అంతకుముందు ఫిబ్రవరి 21న నిఫ్టీ 22,249 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది.

అదే సమయంలో, సెన్సెక్స్(Sensex) దాదాపు 115 పాయింట్ల పెరుగుదలతో 73,255 స్థాయి వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 24 లాభపడగా, 6 క్షీణిస్తున్నాయి.

హీరోమోటో కార్ప్, టైటాన్ కంపెనీ, గ్రాసిం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో,సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా,మారుతి సుజికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్ టీపీసీ, నెస్లే, హిందాల్కో, ఐటీసీ హేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Also Read : దీన్ని కొట్టే కంపెనీ ఏదైనా ఉందా? ఒక్క షేర్ లక్షన్నర! MRF రికార్డ్!!

నిన్న మార్కెట్‌లో పెరుగుదల..
అంతకుముందు నిన్న అంటే ఫిబ్రవరి 22న స్టాక్ మార్కెట్‌(Stock Market News) లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 535 పాయింట్ల లాభంతో 73,158 వద్ద ముగిసింది. నిఫ్టీలోనూ 162 పాయింట్లు పెరిగాయి. 22,217 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 లాభపడగా, 8 పతనమయ్యాయి. ఐటీ, ఆటో షేర్లు మరింత పుంజుకున్నాయి. బ్యాంకింగ్ షేర్ల(Banking Shares) లో క్షీణత కనిపించింది.

బజాజ్ ఆటో, హెచ్‌సిఎల్ టెక్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, ఐటిసి షేర్లు అత్యధికంగా లాభపడగా, ఇండస్‌ ఇండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా, బిపిసిఐఎల్, హీరో మోటార్‌కార్ప్ నష్టాలను మూటగట్టుకుని టాప్ లూజర్ల జాబితాలో చేరాయి.

#stock-market #stock-market-today #nifty-record #sensex-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe