Stock Market Holiday : ఈరోజంతా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్.. 22న సెలవు.. ఎందుకంటే.. అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి. మన దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఆరోజు అంటే జనవరి 22న సెలవు ప్రకటించింది. బదులుగా ఈరోజు శనివారం సెలవు అయినప్పటికీ పూర్తి రోజంతా ట్రేడింగ్ ఉంటుంది. By KVD Varma 20 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market Today : అయోధ్య(Ayodhya) రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం(జనవరి 22) భారతీయ స్టాక్ మార్కెట్ మూసివేస్తారు. ఆ రోజున బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఇ) లో ట్రేడింగ్ ఉండదు. అయోధ్యలో రామ మందిర(Ram Mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) జనవరి 22న రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించింది. శనివారం రోజంతా మార్కెట్‌లో ట్రేడింగ్.. రిపోర్ట్స్ ప్రకారం, దీనికి బదులు ఈరోజు అంటే శనివారం(జనవరి 20) స్టాక్ మార్కెట్ తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు శనివారం కేవలం రెండు గంటలపాటు మార్కెట్‌ను తెరవాలనేది ప్లాన్. అయితే, కొత్త సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు మార్కెట్‌లో శనివారం రోజంతా ట్రేడింగ్ ఉంటుంది - ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు, ఈ రోజు మార్కెట్ తెరచి ఉంటుంది. ఆదివారం(జనవరి 21) సెలవు(Stock Market Holiday) కారణంగా మార్కెట్ యధావిధిగా మూసివేస్తారు. ముందు చెప్పింది ఇదీ.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) మరియు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) కూడా 20 జనవరి 2024న అంటే శనివారం తెరిచి ఉంటుందని ముందుగా ప్రకటించారు. అయితే.. రెండు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌లు మాత్రమే ఉంటాయని చెప్పారు. విపత్తు రికవరీ సైట్‌ను పరీక్షించడానికికొద్దిసేపటి పాటు ఓపెన్ లో ఉంచుతున్నట్టు చెప్పారు. ముందుగా చెప్పిన ప్రకారం మొదటి సెషన్‌లో ఉదయం 9.15 నుండి 10 గంటల వరకు ప్రైమరీ సైట్‌లో, రెండవది డిఆర్ సైట్‌లో ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్ ఉంటుంది. ప్రీ-ఓపెనింగ్ సెషన్ ఉదయం 9 నుండి 9.08 వరకు - 11.15 నుంచి 11.23 వరకు ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్ - ఆప్షన్ కాంట్రాక్టులతో షేర్లతో సహా సెక్యూరిటీలలో ఎగువ, దిగువ సర్క్యూట్ పరిమితులు 5%గా ఉంటాయి. అంటే, షేర్లు ఈ పరిధిలో మాత్రమే హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇప్పటికే 2% బ్యాండ్‌లో ఉన్న స్టాక్‌లు ఈ బ్యాండ్‌లోనే ఉంటాయని స్టాక్ మార్కెట్ ప్రకటించింది. ఇప్పుడు ప్లాన్ మారింది.. సోమవారం అంటే జనవరి 22 సెలవు(Stock Market Holiday) ప్రకటించిన కారణంగా ముందుగా అనుకున్నట్టు రెండు సెషన్స్ లో కాకుండా శనివారం అంటే జనవరి 20న పూర్తి రోజంతా ట్రేడింగ్ నిర్వహిస్తారు. Also Read: భలే ఛాన్స్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే.. Watch this interesting News : #stock-market #stock-market-news #bse #nse మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి