Stock Market: నేడు స్టాక్ మార్కెట్ ఎలా ముగిసిందంటే..? నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. By Nikhil 29 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market Today: సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు ముగింపు. నిఫ్టీ (Nifty) వరుసగా 11వ రోజు కూడా లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మరియు బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం క్షీణతతో ముగిశాయి. సెక్టోరల్‌గా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మీడియా, మెటల్, పవర్ సూచీలు 0.5-1 శాతం క్షీణతతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 349.05 పాయింట్లు అంటే 0.43 శాతం లాభంతో 82,134.61 వద్ద ముగిసింది. నిఫ్టీ 99.60 పాయింట్లు అంటే 0.4 శాతం లాభంతో 25151.95 వద్ద ముగిసింది. #stock-market-news #stock-market-today #sensex #nifty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి