Stock Market News : పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి 

నిన్న (డిసెంబర్ 26) స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 71,336 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లకు పైగా పెరిగింది. 21,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి. 

Stock Market News : పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి 
New Update

Stock Market News : స్టాక్ మార్కెట్ నిత్యం పైకీ కిందికీ కదులుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కదలికల వెనుక అనేక కారణాలుంటాయి. జాతీయ రాజకీయాల నుంచి అంతర్జాతీయ సమస్యల వరకూ.. అలాగే దేశీయ పరిస్థితుల నుంచి ప్రపంచ మార్కెట్ల కదలికల వరకూ అన్నీ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఒక్కోసారి ప్రపంచంలో ఎదో మూల జరిగిన చిన్న సంఘటన కూడా దేశీయంగా స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేయవచ్చు. అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రారంభ సమయంలో ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. అందుకే నిన్నటి అంటే మంగళవారంనాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం. 

నిన్న (డిసెంబర్ 26) స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 71,336 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లకు పైగా పెరిగింది. 21,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి. నిన్న బ్యాంకింగ్, ఫార్మా, పవర్ షేర్లలో మరింత పెరుగుదల కనిపించింది.

ముఖ్యంగా మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో స్టాక్‌ ఇండెక్స్(Stock Index) లు లాభాలను చూశాయి. వరుసగా ఇది స్టాక్ ఇండెక్స్ లకు మూడోరోజు లాభాల ముగింపు అని చెప్పవచ్చు. శుక్రవారం (డిసెంబర్ 23) తరువాత స్టాక్ మార్కెట్  కు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అంతకు ముందు డిసెంబర్ 22, 23 తేదీల్లో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో మంగళవారం మూడోరోజు కూడా లాభాలతో ముగిసినట్లయింది. వరుస సెలవుల తర్వాత ఫ్లాట్ గా మొదలయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకోవడంతో క్రమంగా లాభాల దిశలో ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. 

Also Read: లే ఆఫ్ లతో ఈ ఏడాది గడిచిపోయింది.. మరి కొత్త సంవత్సరంలో ఎలా ఉండొచ్చు?

యూరప్ మార్కెట్లు(Europe Markets) బాక్సింగ్‌ డే కారణంగా పనిచేయలేదు. మరోవైపు అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.  రూ.1,636 కోట్ల షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించారు. రూ.1,464 కోట్ల షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు  కొన్నారు. 

Stock Market News : ఇక ఐపీవో(IPO) విషయానికి వస్తే మోటిసన్స్‌ జ్యువెలరీ లిస్టింగ్‌ కు మంగళవారం వచ్చింది. మొదటి రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్‌ఈ(BSE) లో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఆ తరువాత  ఒక దశలో 98 శాతంపైగా ఎగసింది. దీంతో గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ఈ షేరు ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ(NSE) లోనూ ఇది 98 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆ తరువాత దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం తెల్సిందే. 

Stock Market News: ఇక నిఫ్టీలో టాప్ గెయినర్స్ గా విప్రో, HCL టెక్, బజాజ్ ఆటో నిలిచాయి. టాప్ లూజర్స్ గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి. 

Stock Market Closing 26.12.2023 Stock Market Closing 26.12.2023

Watch this interesting Video:

#stock-market-news #bse #sensex #nse
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe