Andhra Pradesh: స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.5 లక్షల 40 వేల కోట్ల రుణప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ విడుదల చేసింది. అందులో రు.3 లక్షల 75 వేల కోట్ల ప్రాధాన్య రంగాలకు, రూ.లక్షా 65 వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించింది.

New Update
Andhra Pradesh: స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

AP SLBC Meeting: ఏపీలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (SLBC) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదు ప్రధాన అంశాలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో కమిటీ వేయనున్నారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.5 లక్షల 40 వేల కోట్లతో రుణప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ విడుదల చేసింది. అందులో రు.3 లక్షల 75 వేల కోట్ల ప్రాధాన్య రంగాలకు, రూ.లక్షా 65 వేల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక రూపొందించింది. అలాగే వ్యవసాయ రంగానికి రూ.2 లక్షల 64 వేల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు.


గతంలోకంటే 14 శాతం ఎక్కువగా రుణాలిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. సాగు ఖర్చులు తగ్గించడంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. కౌలు రైతులకు సులభంగ రుణాలు అందించాలని సూచించారు. మరింత మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మరోవైపు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే MSME రంగానికి రూ.87 వేల కోట్లు రుణాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అలాగే గృహ నిర్మాణానికి కూడా రూ.11 వేల 500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Also read: పవన్‌కు మరో పరీక్ష.. ఆయన ఇలాకాలోనే మహిళ మిస్సింగ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు