Water: నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమా.. ఏం జరుగుతుంది?

ఈ భూమి మీద ప్రతీ జీవి బతకడానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటి కొరత 20 శాతానికి చేరుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. నిలబడి నీటిని తాగడం వల్ల కడుపులో ఒత్తిడి పడి హెర్నియాకు దారి తీస్తుంది. కూర్చుని నీరు తాగితే దాహం తీరుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.

Water: నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమా.. ఏం జరుగుతుంది?
New Update

Water: ఈ భూమి మీద ప్రతీ జీవికి నీరు చాలా అవసరం. మానవ శరీరానికి అయితే ఇంకా చాలా ముఖ్యం. ఉరుకుల పరుగుల జీవితంలో కొందరికి నీరు తాగే టైం కూడా ఉండదు. అయితే కొందరూ ప్రీజ్‌లో నీరైనా, కుండలో నీరైని వాటి వద్దకు వెళ్లి అక్కడె నిలబడి తాగుతాం. ఇలా ప్రతి ఒక్కరూ నీటిని నిలబడి తాగుతారు. అయితే ఇలా నిలబడి నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారం, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యమైన హెల్త్‌ కోసం రోజుకు మనం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 1 శాతం శరీరంలో నీరు లోటు ఉన్నా ఇబ్బందిగానే ఉంటుంది.

అందుకని ప్రతి గంటకూ నీరు తాగలని చెబుతారు. ఈ లోటు 5 శాతంకి చేరితే..శరీరంలో రక్త నాళాలు సాగడం వంటి సమస్యలు వస్తాయి. ఫలితంగా శరీరంలో సత్తువ క్షిణిస్తుంది. ఈ లోటు 10 శాతంకి చేరితే..అస్పష్టంగా కనిపించడం, అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు శరీరంలో నీటి కొరత 20 శాతానికి చేరుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని బట్టి చూస్తే మనిషి శరీరానికి నీరు ఎంత అవసరం. అయితే.. ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే.. నీటిని అనేక విధాలుగా తాగుతూ ఉంటారు. కానీ.. నీటిని నిలబడి తాగడం మంచిది కాదన్న విషయం తెలుసా..? నిలబడి తాగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఎలా నీరు తాగితే ఎలాంటి ఉపయోగాలు ఉన్నయో ఇప్పుడు విషయాలు తెలుసుకుందాం.

నీటిని నిలబడి తగితే కలిగే ప్రయోజనాలు

  • నిలబడి నీటిని తాగడం వల్ల కడుపులో ఒత్తిడి పడి హెర్నియాకు దారి తీస్తుంది. దీంతో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపి మోకాళ్ళ కీళ్ల పై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
  • కూర్చుని నీరు తాగితే..నీటిలోని న్యూట్రియెంట్స్‌ని శరీరం అబ్జార్వ్ చేస్తుంది. అయితే..నిలబడి నీళ్ళు తాగితే అది జరగదు.
  • సాధారణంగా నిలబడి ఉన్నప్పుడు శరీరంలో టెన్షన్ ఉంటుంది. ఆ పొజిషన్‌లో నీళ్లు తాగినప్పుడు నరాల సమస్య వచ్చే అవకాశం ఉంది.
  • ఇలా నిలబడి నీరు తాగితే ఆ నీటిని ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు అవకాశం ఉండదు. తద్వారా కిడ్నీలో, బ్లాడర్‌లో మలినాలు పేరుకుపోయి.. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీలు పర్మినెంట్‌గా డామేజ్‌తోపాటు, మూత్రాశయ సమస్యలు వస్తాయి.
  • నిలబడి నీళ్ళు తాగడం వలన ఈసోఫేగస్ మీద ప్రెజర్‌ పడుతుంది. దీంతో పొట్టలోని ఆసిడ్స్ వెనక్కి వెళ్లి..ఒక్కసారి నీళ్ళు తాగగానే గుండెలో మంటగా ఉంటుంది.
  • అందుకని కూర్చుని నీరు తాగితే దాహం తీరుతుంది. దీనివల్ల నీటిలోని న్యూట్రియెంట్స్‌ని శరీరానికి అందుతాయి.

ఇది కూడా చదవండి: ఫుడ్‌ కోమా అంటే తెలుసా..ఎలాంటి నష్టాలు ఉంటాయి..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #water #standing
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe