SSMB 29 Movie : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబో మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే కు అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు.
కానీ జక్కన్న మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ బాగా అప్సెట్ అయ్యారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర న్యూస్ బయటికొచ్చింది. తాజాగా డైరెక్టర్ రాజమౌళి టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..అక్టోబరు 10న రాజమౌళి బర్త్డే స్పెషల్ గా SSMB29 నుండి అప్డేట్ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : వరద బాధితులకు అండగా దగ్గుబాటి ఫ్యామిలీ.. సురేష్ ప్రొడక్షన్స్ తరుపున భారీ విరాళం
అంతేకాదు ఈ నెల సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని తెలుస్తోంది. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్ బాబు సరికొత్త కొత్త లుక్ లో కనిపించనున్న ఈ సినిమాను నిర్మాత కె.ఎల్. నారాయణ సుమారు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.