SSC : ట్రాన్స్‌లేటర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌..రూ.1,42,400 జీతం.. ఎస్‌ఎస్‌సీ కీలక అప్‌డేట్!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ JHT,SHT 2023 తుది ఫలితాలను ప్రకటించింది. పేపర్ 1, పేపర్ 2లో హాజరైన అభ్యర్థులు తమ తుది ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. సీనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,42,400 వరకు జీతం ఇస్తారు.

New Update
SSC : ట్రాన్స్‌లేటర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌..రూ.1,42,400 జీతం.. ఎస్‌ఎస్‌సీ కీలక అప్‌డేట్!

Staff Selection Exam Translator Jobs :స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష(Jr. Hindi Translator Recruitment Exam) తుది ఫలితాలను ప్రకటించింది. జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని విజిట్ చేసి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్‌టేటర్‌ పరీక్ష కోసం జరిగిన పేపర్-1 ఎగ్జామ్‌ ఫలితాలు నవంబర్‌ 23, 2023లో రిలీజ్ అయ్యారు పేపర్‌-1లో క్వాలిఫై అయిన వారికి పేపర్‌-2 ఎగ్జామ్‌ పెట్టారు. డిసెంబర్ 31, 2023న పేపర్ 2 ఎగ్జామ్‌ జరిగింది.

జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ అండ్‌ సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్షలో మొత్తం 296 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో 150 మంది అభ్యర్థులు జనరల్ కేటగిరీ, 69 మంది ఓబీసీ, 25 మంది ఈడబ్ల్యూఎస్, 38 మంది ఎస్సీ, 14 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం ఇస్తారు. ఇతర పోస్టులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వేతనం లభిస్తుంది.

ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోవచ్చు:
అభ్యర్థులు తమ ఫలితాలను కమిషన్ వెబ్‌సైట్ నుంచి ఈజీగా చెక్‌ చేసుకోవచ్చు.

--> ముందు SSC అధికారిక వెబ్‌సైట్‌ను(ssc.gov.in) విజిట్ చేయండి.

--> ప్రధాన పేజీలో కనిపించే SSC JHT తుది ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి.

--> మీ స్క్రీన్‌పై PDF ఓపెన్ అవుతుంది. రిజల్ట్‌ చెక్‌ చేసుకోండి.

Also Read : నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా?

Advertisment
తాజా కథనాలు