10th Class Memos : ఒక వ్యక్తికి ఆధార్ నంబర్, ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ(TSPSC) వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) ఎలాగో.. పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్(PEN) ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. 11 అంకెలు గల యూనిక్ ఐడీని పదో తరగతి విద్యార్థుల సర్టిఫికేట్లపై ముద్రించడానికి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం పర్మీషన్ ఇచ్చింది. ఇదివరకూ పదో తరగతి మెమోలపై హాల్ టికెట్ నంబర్ మాత్రమే ముద్రించేవారు. ఆ తర్వాత వీటికి పలు అంతర్గత సెక్యూరిటీ ఫీచర్లను చేర్చారు. అయినప్పటికీ సర్టిఫికేట్లు అసలువో, నకిలీవో తెలుసుకోవాలంటే లోతైన పరిశీలన జరిగేది. కాని ఇప్పుడు పెన్ నంబర్ వల్ల సులభంగా గుర్తించవచ్చు.
Also Read: కాషాయ రంగులోకి మారిన దూరదర్శన్ లోగో.. బీజేపీపై తీవ్ర విమర్శలు..
పెన్ నంబర్‌ను అమలు చేయడం ఇదే తొలిసారి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అనే తేడాలేమి లేకుండా అంతటా ఈ నంబర్‌ను అమలు చేస్తారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడీ తరహాలో నంబర్‌ను కేటాయిస్తారు. ఈ నంబర్ ఆధారంగా ఆయా విద్యార్థి ఎక్కడ చదివారో అన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఇదిలాఉండగా.. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ.. డిజిలాకర్, అకడమిక్ క్రెడిట్ బ్యాంక్ (ACB)లను అమల్లోకి తీసుకొచ్చింది. వన్ స్టూడెంట్ వన్ ఐడీ పేరిట విద్యార్థులకు అటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీని జారీ చేస్తుంది. అయితే అపార్ ఐడీకి తల్లిదండ్రుల నుంచి ముందస్తు పర్మిషన్ కావాలి. కానీ పెన్ నంబర్ జారీ చేసేందుకు తల్లిదండ్రుల నుంచి అనుమతి అవసరం లేదు.
ఈ నేపథ్యంలోనే.. అపార్‌తో పని లేకుండా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో నమోదైన విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ పెన్ నంబర్‌ను అమలుచేస్తుంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే విద్యార్థులందరికీ ఈ నంబర్‌ను జారీ చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థికి సంబంధించిన విద్యా ప్రయాణం, ప్రగతి అంతా కూడా ఆన్‌లైన్‌లో నమోదవుతుంది. ఒక కోర్సు నుంచి ఇంకో కోర్సుకు.. ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యా సంస్థకు మారిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదవుతూనే ఉంటాయి. అంతేరాదు ఆన్‌లైన్‌లో నంబర్‌ను ఎంటర్ చేయగానే.. విద్యార్థికి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. దేశంలో తొలిసారిగా బోగస్ విద్యార్థులను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి నామినల్స్ రోల్స్‌ను యూడైస్‌తో అనుసంధానించారు. యూ డైస్‌లో పేర్లు ఉన్న వారి నుంచే పరక్ష ఫీజులను కట్టించారు. ఇప్పుడు పదో తరగతి మోమోలు, టీసీలపై పెన్ నెంబర్‌ను ముద్రిస్తున్నారు.