SS Rajamouli: కల్కి గ్లింప్స్‌పై జక్కన్న ప్రశంసలు.. కానీ ఒకే ఒక్క ప్రశ్న? ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ గురించే చర్చిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ గ్లింప్స్‌పై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసలు కురిపించారు. By BalaMurali Krishna 21 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD(Kalki2898AD)'. గురువారం ఈ గ్లింప్స్ వీడియోను అమెరికా శాన్ డియాగో కామిక్ కాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ప్రభాస్ లుక్, విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ గ్లింప్స్‌పై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) కూడా ప్రశంసలు కురిపించారు. ‘నాగి, వైజయంతీ మూవీస్(Vyjayanthi Movies) అద్భుతంగా పనిచేశారు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ప్రేక్షకులను నమ్మించే విధంగా సృష్టించడం చాలా కష్టమైన పని. అలా చేసి చూపించవొచ్చని మీరు నిరూపించారు. డార్లింగ్ మామూలుగా లేడు. కాకపోతే ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది.. విడుదల తేదీ’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. జక్కన్న మీరు అడగకూడదు ఆ మాట.. జక్కన్న పోస్టు చూసిన సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ పర్సన్స్ కూడా వెరైటీగా స్పందిస్తున్నారు.‘చూడండి ఎవరు విడుదల తేదీ గురించి అడుగుతున్నారో'అంటూ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కామెంట్ చేశారు. ఆయనే కాదు చాలా మంది ఫ్యాన్స్ కూడా సార్ రాజమౌళి(SS Rajamouli) మీరు రిలీజ్ డేట్ గురించి మాట్లాడకూడదంటూ సరదాగా సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి తీసే సినిమాలు చాలా సమయం తీసుకుంటాయి. మొదట ఆ తేదీని సినిమాను విడుదల చేస్తామని ప్రకటిస్తారు. ఆ తర్వాత రిలీజ్ తేదీలు మారుతూ ఉంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విడుదల తేదీల విషయంలో ఇలాగే జరిగింది. అందుకే జక్కన్నపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మాణం.. 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachan), లోకనాయకుడు కమల్ హాసన్(kamal haasan), దీపికా పడుకొనే(Deepika Padukone), దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని 'దసరా' ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ నటించిన 'సలార్' సీజ్‌ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వనుంది. #prabhas #ss-rajamouli #vyjayanthi-movies #kalki2898ad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి