/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-6.jpg)
Pawan Kalyan Old Speech : క్యాస్టింగ్ కోచ్ (Casting Couch) వివాదంతో టాలీవుడ్ (Tollywood) లో సంచలనాన్ని రేపిన శ్రీరెడ్డి (Sri Reddy) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో నిత్యం సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తూ నెట్టింట హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ను సపోర్ట్ చేసే ఈమె పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చంద్రాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
ఇక తాజాగా శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఓ ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టింది. నేడు స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఆ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది.
— Sri Reddy (@SriReddyTalks) August 15, 2024
Also Read : తలపతి విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
ఆ వీడియోలో పవన్ కళ్యాణ్.. మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే.. 23 ఏళ్ల వయస్సులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకొని చనిపోయాడు. అని గతంలో చెప్పిన పవన్ మాటలకు ఓర్నీ మీ దుంపలు తెగ మీరు ఎక్కడ తయారయ్యార్రా బాబు అనే డైలాగ్‌ను యాడ్ చేస్తూ ‘అనెదర్ డైమండ్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం’ అంటూ క్యాప్షన్ జోడించింది.
దీంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన్ని ఉరేశారు అని, ఉరికి, ఆత్మహత్యకు తేడా తెలియని వాళ్ళు కూడా డిప్యూటీ సీఎంలు అవుతున్నారంటూ పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.