Ayodhya : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని అయోధ్య(Ayodhya) లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర(Ram mandir) నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక రామమందిరం ప్రారంభోత్సవం తేదీ కూడా ఖరారైపోయింది. వచ్చే ఏడాది జనవరి 22న దేవతామార్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ(PM Modi) కూడా వారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించారు. అటు సచిన్, కోహ్లీ, అమితాబ్ లాంటి ప్రముఖులను కూడా ఈ ప్రారంభోత్సవానికి పిలుస్తున్నారు. ఇక తాజాగా రామ మందిరానికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది.
గర్భగుడి ఫొటో:
రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు. 'శ్రీరాంలాలా భగవానుడి గర్భగుడి దాదాపు సిద్ధంగా ఉంది. ఇటీవలే లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.' అని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కోట్లాది మంది హిందూవుల కల:
2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ.. రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్యలోనే, 3 శిల్పుల బృందాలు 3 వేర్వేరు ప్రదేశాలలో రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నాయి. అత్యంత అందమైన రాముడి విగ్రహాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ధర్మకర్తలు ఎంపిక చేస్తారు. 22 జనవరి 2024, పౌష్ శుక్ల పక్ష ద్వాదశి తేదీన, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పవిత్రమైన అభిజీత్ ముహూర్తంలో ఉత్తమ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. రాముడు తన ముగ్గురు సోదరులు భరత్, లక్ష్మణ్, శత్రుఘ్నలతో కలిసి అయోధ్యలోని తాత్కాలిక ఆలయంలో ప్రతిష్టించారు.
Also Read: ఆక్షనీర్ గా ఆకర్షిస్తున్న మల్లికా సాగర్..నెట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు
WATCH: