Power Cut : శ్రీలంక(Srilanka) లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. కరెంట్ ఆగిపోవడంతో శ్రీలకంలో అంధకారం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాంకేతిక సమస్య వల్లే కరెంట్ ఆగిపోయినట్లు శ్రీలంక విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్(CEB) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యుత్ లేకపోవడంతో ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఉన్న రోగులు అవస్థలు పడుతున్నారు.
Also Read: ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక
అయితే కరెంట్ నిలిచిపోవడంపై సీబీఈ సంస్థ స్పందించింది. దేశంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని సీఈబీ సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత వెల్లడించారు. ఇదిలాఉండగా.. శ్రీలంకలో విద్యుత్ నిలిచిపోవడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read: బీజేపీకి ఓటు వేయడంతో ముస్లీం మహిళను కొట్టిన బంధువు.. చివరికి