Srilanka : శ్రీలంకలో పవర్ కట్.. అంధకారంలో దేశ ప్రజలు శ్రీలంకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దేశమొత్తం కరెంట్ ఆగిపోవడంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే కరెంట్ ఆగిపోయినట్లు శ్రీలంక విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ తెలిపింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. By B Aravind 09 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Power Cut : శ్రీలంక(Srilanka) లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. కరెంట్ ఆగిపోవడంతో శ్రీలకంలో అంధకారం నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాంకేతిక సమస్య వల్లే కరెంట్ ఆగిపోయినట్లు శ్రీలంక విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్(CEB) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. విద్యుత్ లేకపోవడంతో ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఉన్న రోగులు అవస్థలు పడుతున్నారు. Also Read: ఐరాసలో తీర్మానాన్ని వీటోపవర్‌తో అడ్డుకున్న అమెరికా..ఇరాన్ హెచ్చరిక అయితే కరెంట్ నిలిచిపోవడంపై సీబీఈ సంస్థ స్పందించింది. దేశంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని సీఈబీ సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత వెల్లడించారు. ఇదిలాఉండగా.. శ్రీలంకలో విద్యుత్ నిలిచిపోవడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Countrywide Power Outage Reported in Sri Lanka 🇱🇰 A widespread power outage struck Sri Lanka, according to a spokesperson from the #Electricity Supply Council who spoke with local media. 1/3 | #SriLanka | #srilankan | pic.twitter.com/u5xBGO8z7E — Sputnik India (@Sputnik_India) December 9, 2023 Also read: బీజేపీకి ఓటు వేయడంతో ముస్లీం మహిళను కొట్టిన బంధువు.. చివరికి #telugu-news #srilanka #power-outage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి