IPL: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జాయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో పవర్ ప్లేలోనే 2 వికెట్లు కొల్పోయింది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్, కృణాల్ పాండ్యా ఆచితూచి ఆడుతున్నారు. 8 ఓవర్లు ముగిసేసరికి 45/2 పరుగులు చేసింది.
పరాజయాలతో సతమతమతున్న ఎస్ఆర్‌హెచ్..
ఇక ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమతున్న ఎస్ఆర్‌హెచ్ మళ్లీ విజయాల బాట పట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ జట్టులో రెండు కీలక మార్పులు చేశారు. పేసర్ మార్క్ యాన్సన్ స్థానంలో శ్రీలంక స్పిన్నర్ విజయ్‌కాంత్ వియస్కాంత్, బ్యాటర్ మయాంక్ స్థానంలో సన్వీర్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే లక్నో చివరగా ముంబై జట్టుపై 98 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్లే ఆప్ లో నిలవాలంటే రెండు జట్లకు విజయం అనివార్యమైంది. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఇందులో ఎవరు ఓడినా ‘నాకౌట్’ దశకు చేరుకోవడం కష్టమే.
ఇది కూడా చదవండి: Impact player: ఐపీఎల్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఔట్.. ఆల్ రౌండర్లకు శాపంగా మారడంతో!
అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ ఈ ఎడిషన్‌లో హైదరాబాద్ తన తొలి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది. సెకండ్ హాఫ్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మూడుసార్లు తలపడగా అన్నింట్లోనూ లఖ్‌నవే గెలిచింది. ఇక ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండగా.. మంగళవారం రాత్రి భారీగా వర్షం పడటంతో పిచ్ బౌలర్లకు సహకారం లభించే అవకాశం ఉంది.