IPL: ఐపీఎల్ టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ (impact player rule)పై క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. గతేడాది ఐపీఎల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన కారణంగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని, సరైనా అవకాశాలు రావట్లేదంటున్నారు. ఈ 17వ సీజన్ లో పలు ఉదాహరణలు చూపిస్తూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Impact player: ఐపీఎల్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఔట్.. ఆల్ రౌండర్లకు శాపంగా మారడంతో!
ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధన ఆల్ రౌండర్లకు శాపంగా మారిందంటూ పలువురు మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్ లో ఈ రూల్ తొలగించాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి.
Translate this News: