Sreemukhi బ్లాక్ డ్రెస్.. మల్లెపూల జడతో.. యాంకర్ శ్రీముఖి అందాలు బుల్లి తెర యాంకర్ గా శ్రీముఖి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్స్ షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హాఫ్ సారీలో మల్లెపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. By Archana 05 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sreemukhi Latest Photos: టాలీవుడ్ పాపులర్ యాంకర్స్ లో ఒకరు శ్రీముఖి. కామెడీ టైమింగ్, చలాకీతనంతో ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. రాములమ్మ (Ramulamma) అనే ట్యాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. యాంకర్ రవి, శ్రీముఖి జంటగా చేసిన పటాస్ (Pataas) షోతో బాగా పాపులరైన ఈ బ్యూటీ.. పలు టీవీ షోలు,సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో (Bigg Boss Telugu 3) ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. రన్నరప్ గా నిలిచి మరింత క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ తరువాత యాంకర్ గా వరుస టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ తో అదరగొడుతూనే.. నటిగా కూడా రాణిస్తుంది. ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా సాగుతోంది ఈ బుల్లితెర గ్లామర్. రీసెంట్ గా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. Also Read: Sreeleela Latest Photos: చీరకట్టులో శ్రీలీలాను ఇలా చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే! ఇక సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ ఉండే శ్రీముఖి తన లేటెస్ట్ ఫొటోలతో గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో.. మలీపూల జడతో శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సాంప్రదాయ వస్త్రాలంకారణలో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. శ్రీముఖి అల్లు అర్జున్ సినిమా జులై తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత నేను శైలజ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సావిత్రి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో కనిపించి మెప్పించింది. ఇటు సినిమాలు, టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది శ్రీముఖి. బుల్లితెర పై డిమాండ్ ఉన్న హోస్ట్ గా దూసుకెళ్తుంది. హోస్ట్ గా మాత్రమే కాదు డాన్స్ ఐకాన్, వంటి షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించింది. మా టీవీలో ఒకేసారి రెండు నుంచి మూడు షోలు చేస్తూ బిజీగా సాగుతోంది ఈ అమ్మడు. Also Read: Also Read: Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్.. మేకింగ్ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్! #anchor-sreemukhi #sreemukhi-latest-photos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి