Sreeleela: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు

'భగవంత్ కేసరి'లో కూతురు పాత్ర చేయవద్దని తనకు చాలామంది చెప్పారని టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల అన్నారు. 'అన్ స్టాపబుల్ 3' ఫస్టు ఎపిసోడ్ లో పాల్గొన్నారు 'భగవంత్ కేసరి' టీమ్. ఈ సందర్భంగా యంగ్ హీరోయిన్ శ్రీలీల పలు విషయాలను వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి పనిచేయడానికి భయపడ్డానని..అయితే బాలయ్య తన భయం పోగొట్టడంతో సినిమాలో ఈజీగా వర్క్‌ చేసానని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల.

New Update
Sreeleela: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు

Sreeleela in Unstoppable 3: 'భగవంత్ కేసరి'లో (Bhagavanth Kesari)  కూతురు పాత్ర చేయవద్దని తనకు చాలామంది చెప్పారని టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల అన్నారు. 'Unstoppable 3' ఫస్టు ఎపిసోడ్ లో పాల్గొన్న శ్రీలీల బాలకృష్ణతో (Balakrishna) కలిసి పనిచేయడానికి భయపడ్డానని చెప్పింది.అయితే బాలయ్య తన భయం పోగొట్టడంతో సినిమాలో ఈజీగా వర్క్‌ చేసానని చెప్పుకొచ్చింది. అంతే కాదు 'భగవంత్ కేసరి' టీమ్ అందరు సినిమా ముచ్చట్లు చెబుతూ సందడి చేశారు.

Also Read: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌..!!

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'అన్ స్టాపబుల్ 3' టాక్ షో సీజన్ 3 సందడి మొదలైపోయింది. ఈ టాక్ షోకి సంబంధించిన ఫస్టు ఎపిసోడ్ నిన్న స్ట్రీమింగ్ అయింది. ఫస్టు ఎపిసోడ్ లో 'భగవంత్ కేసరి' టీమ్ చేసిన సందడి అంత ఇంత కాదు. బాలయ్యతో పాటు అనిల్ రావిపూడి (Anil Ravipudi)..అర్జున్ రామ్ పాల్ .. కాజల్ (kajal) .. శ్రీలీల ఈ స్టేజ్ పై ప్రేక్షకులకు కనువిందు చేశారు.

publive-image

ఈ షో సందర్భంగా శ్రీలీల పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా చేశానని తెలిపింది. 'పెళ్లి సందD' రిలీజ్ తరువాత ఈ ఛాన్స్ వచ్చిందని..కాగా,. అప్పుడు చాలామంది కూడా ఈ సమయంలో కూతురు పాత్ర చేయడం మంచిది కాదనే చెప్పారని పేర్కింది. కానీ ఇలాంటి ఒక పాత్రను ఇకపై చేసే ఛాన్స్ రాదేమోనని నాకు అనిపించిందని.. అందుకే, స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అని చెప్పింది.

publive-image

అయితే, బాలకృష్ణగారితో కలిసి పనిచేయడానికి భయపడ్డానని చెప్పుకొచ్చింది. కానీ ఆ తరువాత ఆయన ఆ భయాన్ని పోగొట్టడంతో ఈజ్ తో చేయగలిగానని శ్రీలీల అంది. బాలకృష్ణ ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడతారని. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉందని. అలాంటి ఒక సినిమాను చేయడానికి బాలకృష్ణ లాంటి స్టార్ ముందుకు రావడం ఆయన మంచి మనసుకు నిదర్శనం శ్రీలీల తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు