Tamilnadu : కల్తీమద్యం కలకలం.. ఐదుగురు మృతి

తమిళనాడులో కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై విచారణ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

New Update
Tamilnadu:  కల్తీసారా ఘటనలో..58 మందికి చేరిన మృతుల సంఖ్య!

Liquor : తమిళనాడు (Tamilnadu) లో మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం (Spurious Liquor) తాగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్తీ సారా విక్రయాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండే చేస్తున్నారు. మరోవైపు కల్తీ మద్యం ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై విచారణ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Also Read: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. అక్కడ పనిచేస్తే రూ.8 లక్షల ప్యాకేజ్‌

మరోవైపు బీజేపీ (BJP) నేతలు రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలని తమిళనాడు బీజేపీ చీఫ్ కే.అన్నమలై (K Annamalai) డిమాండ్ చేశారు. గతఏడాది చెంగలపట్టు జిల్లాలో కూడా 23 మంది కల్తీసారా తాగి మృతిచెందినట్లు గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వ కల్తీమద్యాన్ని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.

Also Read: పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు.. కానీ జ్ఞానం కాదు : మోదీ

Advertisment
తాజా కథనాలు