Virat Kohli : క్రికెట్కు గుడ్ బై...  చివరి మ్యాచ్ ఆడేసిన కోహ్లీ - VIDEO VIRAL

ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

New Update
kohli virat

విరాట్ కోహ్లీ తన చివరి మ్యాచ్ ఆడేసినట్లు తెలుస్తోంది. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేల్లోనే కొనసాగుతున్న కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్‌ కానుంది. ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్‌కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.  అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి వరుసగా డకౌట్‌లను ఎదురుకున్న కోహ్లీ... అడిలైడ్ ప్రేక్షకులకు వీడ్కోలు పలికాడు. కోహ్లీ మైదానం వీడుతూ ప్రేక్షకులకు వీడ్కోలు తరహాలో చేతులు ఊపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

వీడ్కోలు చెప్పిన తీరుతో

సాధారణంగా మైలురాళ్ళు లేదా చివరి మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు ఇలా వీడ్కోలు చెబుతుంటారు. అడిలైడ్ ప్రేక్షకులకు ఆయన వీడ్కోలు చెప్పిన తీరుతో.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అనే ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగాయి. తాజా వైఫల్యాల నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచకప్‌లోపు కోహ్లీ వన్డేల నుంచి కూడా తప్పుకోవచ్చని క్రీడా విశ్లేషకులు, అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. భారత ఇన్నింగ్స్‌లోని మూడవ ఓవర్ ఐదవ బంతికి మిచెల్ స్టార్క్‌ వేసిన బంతిని ఫోర్ కొట్టడం ద్వారా రోహిత్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్, ఆస్ట్రేలియాలో ఆసీస్‌తో రోహిత్ ఆడుతున్న 21వ వన్డే కావడం విశేషం. ఆస్ట్రేలియాలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో, రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, స్టీవ్ స్మిత్ ఉన్నారు. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ వివ్ రిచర్డ్స్ పేరిట ఉంది. రిచర్డ్స్ ఆస్ట్రేలియాతో వారి దేశంలో 40 వన్డేలు ఆడి మొత్తం 1905 పరుగులు సాధించాడు.

Advertisment
తాజా కథనాలు