IND vs PAK- Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. స‌చిన్‌, సంగ‌క్క‌ర‌ రికార్డులు బ్రేక్‌

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కొహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. అంతేకాదు టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా కూడా ఘనత సాధించారు.

New Update
Virat Kohli

Virat Kohli

IND vs PAK- Virat Kohli: స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్‌ కొహ్లీ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి 15 పరుగులు వద్ద ఈ మైలురాయిని దాటాడు. సచిన్‌, సంగక్కరల రికార్డులను సైతం బ్రేక్ చేశాడు. 

Also Read: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ ఓడితే ఇంటికే.. మరి భారత్ ఓడితే?

సచిన్ టెండుల్కర్‌ 350 ఇన్నింగ్స్‌లో 14 వేల పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లి 287 ఇన్నింగ్స్‌లోనే 14 వేల పరుగులు దాటాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే 14 వేల కన్నా ఎక్కువ పరుగులు చేశారు. తాజాగా కోహ్లి మూడో స్థానంలోకి చేరుకున్నాడు. ఇందులో సచిన్‌ టెండుల్కర్ (భారత్‌) 18,426 పరుగులు, కుమార సంగక్కర (శ్రీలంక) 14,234 పరుగులు, విరాట్‌ కోహ్లి (భారత్‌) 14,002 పరుగులు చేసినవాళ్లుగా ఉన్నారు.  

Also Read: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. తండేల్ స్టోరీ రిపీట్!

సచిన్‌ టెండూల్కర్‌ 463 వన్డే మ్యాచుల్లో 18,426 పరుగులు చేశారు. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక ఆటగాడు సంగక్కర 404 వన్డే మ్యాచుల్లో 14,234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక విరాట్‌ కోహ్లి 287 ఇన్నింగ్స్‌లోనే 14 వేల పరుగులు చేశాడు. ఇందులో 50 సెంచరీలు, 73 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు విరాట్‌ కోహ్లి టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఉన్న మహ్మద్‌ అజారుద్దీన్‌ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లి 158 క్యాచ్‌లతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో మహ్మద్ అజారుద్దీన్-156 , మూడో స్థానంలో సచిన్ టెండుల్కర్‌-140 ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు