నేడు పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా

టీ20 ప్రపంచ కప్‌‌లో మొదటి మ్యాచ్‌లోనే టీమిండియాకి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ ఈ రోజు పాకిస్థాన్‌తో తలపడనుంది. శ్రీలంకపై మొదటి మ్యాచ్ గెలిచిన పాక్ టీమ్‌పై టీమిండియా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

match
New Update

మహిళల టీ20 ప్రపంచకప్‌ అక్టోబర్ 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ ఢీకొన్నాయి. అదే రోజు మరో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక దేశాలు తలపడ్డాయి. బంగ్లాదేశ్ బోణీ కొట్టగా.. శ్రీలంక మీద పాకిస్థాన్ విజయం సాధించింది. ఈ సారి జట్టు స్ట్రాంగ్‌గా ఉండటంతో ఎలా అయిన హర్మన్‌ప్రీత్ సేన ఈజీగా మ్యాచ్ గెలుస్తుంని అందరూ భావించారు. కానీ టీమిండియాకి ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది.

ఇది కూడా చూడండి: బస్సు బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే..

మొదటి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ గ్రూప్‌లో భారత్ చివరి స్థానంలో ఉంది. శ్రీలంక మీద పాకిస్థాన్ మొదటి మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉంది. ఈరోజు భారత్, దాయాది దేశమైన పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈరోజు పాకిస్థాన్ మీద ఇండియా ఎలా అయిన గెలిచి తీరాల్సిందే. లేకపోతే సెమీస్ ఆశలు గాల్లో కలిసిపోయినట్లే. ఓపెనర్లు దూకుడుగా ఆడితే మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. బ్యాటర్లు రాణించకపోతే ఈ మ్యాచ్ కూడా గెలవడం కష్టమే. స్మృతి మందాన, షెఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్ కాస్త తెలివిగా బ్యాటింగ్ చేస్తే ఈ మ్యాచ్‌లో విన్నింగ్ మనదే.

ఇది కూడా చూడండి: రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లు అంతంతమాత్రానే బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో అయిన బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ 15 మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో ఇండియా 12 మ్యాచ్‌లు గెలవగా, పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు మాత్రేమ గెలిచింది. ఈ మ్యాచ్‌లో అయిన ఇండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో.. ఈ టీ20 ప్రపంచ కప్‌లో బోణీ కొడుతుందో లేదో చూడాలి.

భారత్‌: స్మృతి, షెఫాలి, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), జెమీమా, రిచా, దీప్తి, శ్రేయాంక, పూజ, రేణుక, ఆశ, అరుంధతి/రాధ.

పాకిస్థాన్‌: గుల్‌ ఫెరోజా, మునీబా, సిద్రా, నిదా, ఫాతిమా, ఒమైమా, ఆలియా, సాదియా, నష్రా, ట్యూబా, డయానా బేగ్‌.

ఇది కూడా చూడండి: Bengaluru: నటుడు దర్శన్‌ ను వెంటాడుతున్న రేణుకాస్వామి ఆత్మ!

#t20-world-cup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe