Bengaluru: నటుడు దర్శన్‌ ను వెంటాడుతున్న రేణుకాస్వామి ఆత్మ!

బెంగళూరులో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు ఇప్పుడు ఒక వింత సమస్య పట్టుకుంది. ఆల్రెడీ జైల్లో నానా పాట్లు పడుతున్న అతన్ని ఇప్పుడు కొత్తగా రేణుకాస్వామి ఆత్మ పట్టుకుని పీడిస్తోందిట. 

New Update
Actor Darshan

Actor Darshan: 

కన్నడ స్టార్ నటుడు దర్శన్‌, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడ కలిసి రేణుకాస్వామి అనే అభిమానిని హత్యకేసు చేశారు. దర్శన్‌ను ఆయన భార్యకు వదిలి తనతో రావాలంటూ పవిత్రకు రేణుకస్వామి అసభ్యకర సందేశాలు పంపాడన్న కోపంతో వాళ్ళిరూ అతడిని చంపారు. నటి పవిత్రను రేణుకాస్వామి చాలారోజుల పాటూ వేధించాడు. ఈ కేసులో హత్యానేరం కింద జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిజం ఒప్పుకున్నాడు. పోలీసులు దీని తాలూకా  ఛార్జ్‌ షీట్‌ కూడా కోర్టులో దాఖలు చేశారు. నేను చూసే సమయానికి రేణుకాస్వామి బాగా అలసిపోయి కనిపించాడు. అప్పటికే అతనిపై మా వ్యక్తులు బాగా దాడి చేశారు. దాని తర్వాత నేను కూడా అతడి మెడ, ఛాతి, తల దగ్గర తన్నాను. చేతులు, చెట్టుకొమ్మతో కొట్టానని చెప్పారు దర్శన్. అలాగే పవిత్రను కూడా చెప్పుతో కొట్టమని చెప్పానని వాంగ్మూలంలో చెప్పారు దర్శన్. రేణుకాస్వామి హత్యకు ప్రధాన కారణం పవిత్ర గౌడ అని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఆమె ఇతర నిందితులను రెచ్చగొట్టి, వారితో కలిసి కుట్రపన్ని నేరంలో భాగమయ్యారని రుజువైనట్లు చెప్పారు. దీనికి తోడు రేణుకాస్వామి హత్యు సంబంధించి కీలకమైన ఫోటోలు కూడా తాజాగా బయటపడ్డాయి. హత్యకు ముందు వాటిని తీసినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామిని ఒక లారీ ముందు కూచోబెట్టి తీవ్రంగా కొట్టినట్లు ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పిక్స్ కొన్ని పత్రికలు అందడంతో అవి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. ఈ కేసులో మొత్తం 17మందిని అఎస్ట్ చేశారు. ఈ మధ్యనే ఇద్దరికి బెయిల్ కూడా ఇచ్చారు. వారిపై కేసును కూడా కొట్టేశారు. 

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్ బళ్ళారి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. బెంగళూరు పరప్పన్ జైలులో ఉండే అతన్ని కొన్ని రోజుల క్రితమే బళ్ళారి జైలుకు మార్చారు. అయితే ఇప్పుడు జైల్లో ఉన్న దర్శన్‌ను రేణుకాస్వామి ఆత్మ వేధిస్తోందిట. అతను భయంతో నిద్రపోవడం లేదని చెబుతున్నారు. అర్థరాత్రి సమయంలో దర్శన నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నాడని తోటి ఖైదీలు కూడా చెప్పారని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో తనను మళ్ళీ బెంగళూరు జైలుకు తరలించారని దర్శన్ కోరాడని అంటున్నారు.

 

Also Read: Health: చిన్న చిట్కా..అధిక రక్తపోటు మాయం

Advertisment
Advertisment
తాజా కథనాలు