Surya Kumar Yadav: శ్రేయాస్ అయ్యర్ గాయంపై సూర్యకుమార్ సంచలన ప్రకటన..

భారత స్టార్ బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాస్పిటల్‌ బెడ్ పై ఉన్నాడు. అతడు అంతర్గత రక్తస్రావం కారణంగా గత రెండు రోజులుగా ICUలో డాక్లర్ల పర్యావేక్షనలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళే శ్రేయాస్ ఐసీయూ నుంచి బయటకొచ్చాడు.

New Update
Surya Kumar Yadav About Shreyas Iyer Health Update

Surya Kumar Yadav About Shreyas Iyer Health Update

భారత స్టార్ బ్యాట్స్‌మ్యాన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం హాస్పిటల్‌ బెడ్ పై ఉన్నాడు. అతడు అంతర్గత రక్తస్రావం కారణంగా గత రెండు రోజులుగా ICUలో డాక్లర్ల పర్యావేక్షనలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళే శ్రేయాస్ ఐసీయూ నుంచి బయటకొచ్చాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సంచలన అప్డేట్ అందించారు. 

జరిగినది చాలా దురదృష్టకరం

అక్టోబర్ 29న అంటే రేపు ఆస్ట్రేలియా VS భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. శ్రేయాస్ హెల్త్ గురించి మాట్లాడారు. ‘‘శ్రేయాస్ అయ్యర్ బాగా కోలుకుంటున్నాడు. అతను మా ఫోన్‌కు సమాధానం ఇచ్చాడు. అంటే అతను పూర్తిగా బాగున్నాడు. జరిగినది చాలా దురదృష్టకరం. కానీ వైద్యులు అతనిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. రాబోయే కొన్ని రోజులపాటు వైద్యులు అతన్ని పర్యవేక్షిస్తారు. ఆందోళన చెందడానికి ఏమీ లేదు.’’ అని సూర్య కుమార్ చెప్పుకొచ్చాడు. 

సూర్య కుమార్ పేవల ఫామ్

సూర్య కుమార్ ప్రస్తుతం పేవల ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల జరిగిన 2025 ఆసియా కప్ టోర్నీలోనూ పెద్దగా ప్రదర్శన చేయలేకపోయాడు. అతడు గత 16 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం గమనార్హం. అందువల్ల రేపటి నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో సూర్య కుమార్ తన బ్యాట్‌తో పరుగులు చేస్తాడని క్రికెట్ ప్రియులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

T20I భారత జట్టు

శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

Advertisment
తాజా కథనాలు