/rtv/media/media_files/2025/04/17/033gvHRsladzykxChscA.jpg)
ipl-match srh vs mi
ఐపీఎల్ 18లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (40), హెన్రిచ్ క్లాసెన్ (37), ట్రావిస్ హెడ్ (28) రాణించారు. టాస్ ఓడిన బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్స్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(28) , అభిషేక్ శర్మ (40) అదిరపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి దూకుడుగా ఆడుతూ జట్టు స్కోరును 8 ఓవర్లలో 65 పరుగులు దాటించారు. వీరిద్దరి జోడీని కెప్టెన్ హార్దిక్ పాండ్య విడదీశాడు. హార్దిక్ బౌలింగ్‌లో రాజ్ బావాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (2) పరుగులకే క్రీజు నుంచి ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించి రికెల్‌టన్ స్టంపింగ్ కు దొరికిపోయాడు.
𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞 𝟐𝟎𝟐𝟓 ||
— All India Radio News (@airnewsalerts) April 17, 2025
Sunrisers Hyderabad set a target of 163 runs for Mumbai Indians
Brief Score:
SRH 162/5 (20)
📍Wankhede Stadium, Mumbai #MIvSRH | #IPL2025 | #SRHvMI | #TATAIPL2025 pic.twitter.com/6S3mTzCFTG
ఆచితూచి ఆడుతూ
ఆ కాసేపటికే ట్రావిస్ హెడ్ భారీ షాట్‌కు యత్నించి శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుసగా వికెట్లు పడటంతో నితీశ్ కుమార్ రెడ్డి (19), హెన్రిచ్ క్లాసెన్ (37) ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరు పెంచారు. మెల్లిగా స్కోరు బోర్టును 110పరుగులు దాటించారు. ఈ క్రమంలో కాస్త దూకుడుగా ఆడాలనుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో(16.4) తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓవర్ల దగ్గర పడుతుండంతో గేర్ మార్చిన హెన్రిచ్ క్లాసెన్ వరుస బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌లో (18.1) హెన్రిచ్‌క్లాసెన్ (37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో అనికేత్ వర్మ (18) పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ 162 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.