/rtv/media/media_files/2025/06/13/1FFBquQzfP0LPpmpEko9.jpg)
wtc-final sa
WTC Final: లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయింది. 144/8 (40) ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా మూడో రోజు ఆటను మొదలుపెట్టి 63 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో కారె(43), స్టార్క్(58*) టాప్ స్కోరర్స్ గా నిలిచారు.
Also Read: మరోసారి బెదిరింపులు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న రాజాసింగ్!
At 73/7, Australia was staring at collapse. 🫡
— Sportskeeda (@Sportskeeda) June 13, 2025
But Mitchell Starc defied the odds — soaking up 136 balls and scoring a crucial 58.
Thanks to his resilience, the Aussies posted 207. 👏
𝑨 𝒌𝒏𝒐𝒄𝒌 𝒕𝒉𝒂𝒕 𝒘𝒊𝒍𝒍 𝒃𝒆 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒆𝒅! 🔥#AUSvSA #MitchellStarc… pic.twitter.com/yTAgPDXkVO
రబాడ అత్యధికంగా 4 వికెట్లు
దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబాడ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. కాగా WTC ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయింది, అనతరం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యాన్ని పొందింది.
Also Read: విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!
🚨 SA bottled up a nicely held WTC final from 73/7 to 206/9.
— Majnu Bhai (@Majnu_Bhai6) June 13, 2025
140 runs for last 2 wickets🤦🤦.
Generational Chokers for reason Bc. Aussies will win. #AUSvSA#Australia #savas #SAvsAUS #WTCFinal #WTC2O25Final #WtcFinal2025 #WTC25 #wtc2025final #Bavuma #Starc pic.twitter.com/EDaVGaabwN