Sourav Ganguly : పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకోవాలి..  సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్!

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ..  ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్నారు.

New Update
sourav pak

sourav pak

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందారు, దీనితో పొరుగు దేశమైన పాక్ పై ప్రతి ఒక్క భారతీయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం తమాషా కాదన్న గంగూలీ..  ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదన్నారు. అంతేకాకుండా పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని అది జరిగి తీరాలని గంగూలీ డిమాండ్ చేశాడు. ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో కూడా ఆడకూడదని అన్నారు.

డానిష్ కనేరియా మినహా

అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం ఉగ్రదాడిని ఖండించారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై భారత ప్రభుత్వ వైఖరి కారణంగా భారతదేశం పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనదని శుక్లా అన్నారు. కాగా ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రముఖుల నుంచి  స్పందనలు వస్తుంటే..  మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మినహా పాకిస్థాన్‌ క్రికెటర్లు ఎవరూ స్పందించలేదు.  

Also read :  Seema Haider : నేను ఇండియాలోనే ఉంటా.. నన్ను పంపొద్దు.. మోదీకి సీమా రిక్వెస్ట్!

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రవాదులు దాడితో సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని బలమైన సందేశాన్ని ఇచ్చారు, మరణించిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

Also read : TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి

Advertisment
తాజా కథనాలు