శ్రీలంక హెడ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్.. ఎస్‌ఎల్‌సీ అధికారిక ప్రకటన!

శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌తో ఆయన ప్రయాణం మొదలుకానున్నట్లు SLC అధికారికంగా ప్రకటించింది. 2026 మార్చి 31వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు.

New Update
seer

Srilanka Cricket: శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (SLC) సోమవారం అధికారికంగా ప్రకటించింది. సొంతగడ్డపై అక్టోబర్ 13 నుంచి వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌తో ఆయన ప్రయాణం మొదలుకానుంది. మొత్తంగా రెండేళ్లపాటు 2026 మార్చి 31వరకు జయసూర్య కోచ్ గా కొనసాగనున్నాడు. 

 

'శ్రీలంక క్రికెట్ పురుషుల జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్యను నియమించాలని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ఇటీవల భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లతో జరిగిన సిరీస్ లలో జట్టు మంచి ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. జయసూర్య ఇకపై ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు' అని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 

ఎస్‌ఎల్‌సీ క్రికెట్ సలహాదారుడిగా..

ఇక ప్రస్తుతం ఎస్‌ఎల్‌సీ క్రికెట్ సలహాదారుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జయసూర్య.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టుకు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా జయసూర్య ఆద్వర్యంలో శ్రీలంక జట్టు అధ్బుత ప్రదర్శన చేసింది. భారత్‌ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయినప్పటికీ.. వన్డే సిరీస్ దక్కించుకుంది. 1997 తర్వాత తొలిసారి భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌ను శ్రీలంక గెలువడం విశేషం. 

జయసూర్య కెరీర్..

1989లో శ్రీలంక జట్టులోకి వచ్చిన జయసూర్య మంచి ఆల్‌రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. వన్డే క్రికెట్ లో 12,000 పరుగులు, 300 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు. మొత్తం 403 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 12207 పరుగులు చేశాడు. 107 టెస్టు మ్యాచ్‌లు ఆడి 6791 పరుగులు, 96 వికెట్లు సాధించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు