/rtv/media/media_files/2025/01/14/2F5dHHblBp2NZKzyZdDT.jpg)
Huzurabad Kaushik Reddy Photograph: (Huzurabad Kaushik Reddy )
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని సోమవారం అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనే రాత్రి బస చేసిన కౌశిక్‌రెడ్డికి మంగళవారం ఉదయం స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం 09 గంటలకు జిల్లా అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు.
కౌశిక్ రెడ్డిపై 5 కేసులు నమోదు
పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ పై బీఆర్ఎస్ లీగల్ టీమ్ స్పందించింది. కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి దాటాక ఒంటిగంటకు అరెస్ట్ చేసి రాత్రంతా హైడ్రామా క్రియేట్ చేశారని బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ రవీందర్ సింగ్, నారదాసు తెలిపారు. కౌశిక్‌రెడ్డిని రెండు కేసుల్లో అరెస్ట్ చేశారని... ఒకటి ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో పాటుగా ఎమ్మెల్యే సంజయ్ పీఏ ఇచ్చిన ఫిర్యాదును క్లబ్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారని తెలిపారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఇంకేమైనా మారుస్తారా తెలియదన్నారు. కౌశిక్‌రెడ్డికి ఈ రెండు కేసుల్లోనైతే బెయిల్ రావాలని బీఆర్ఎస్ లీగల్ అభిప్రాయపడుతుంది. ఇక మొత్తం కౌశిక్ రెడ్డిపై 5 కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ వన్ టౌన్‌లో మూడు కేసులు నమోదు కాగా.. త్రీటౌన్ పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 12 సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేసినట్లు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి జరిగిన కార్యక్రమలో కౌశిక్ రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం జూబ్లిహీల్స్‌లో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు.హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలించారు. పోలీసుల అరెస్టును కౌశిక్‌రెడ్డి ప్రతిఘటించగా, బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లారు.
కౌశిక్ రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు పెట్టి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసులు పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) కేసు పెడతారు. 6 నెలల వ్యవధిలో ఒకే తరహా నేరాలు 3 కంటే ఎక్కువ చేస్తే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.
Also Read : అత్యవసరమైతేనే తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకోండి!