Rohit Sharma: క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్?

టెస్ట్ క్రికెట్ లో బ్యాట్స్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మ వ్యూహాలు విఫలమవుతున్నాయి. దీంతో అతని ఆటతీరుపై మాజీల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నెటిజన్స్ కూడా రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని, ఆయన స్థానంలో వేరే ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

author-image
By Anil Kumar
New Update
rohit sharma retirement

rohit sharma retirement


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్ కోసం తెగ తంటాలు పడుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆయన బ్యాట్ నుంచి ఒక గొప్ప ఇన్నింగ్స్ కూడా రాలేదు. చివరి 13 టెస్ట్ ఇన్సింగ్స్‌లలో చూసుకుంటే అతని నుంచి ఒక్కటే హాఫ్ సెంచరీ ఉండటం గమనార్హం. 

అటు ఆసీస్‌ టూర్‌లో హిట్ మ్యాన్ వరుసగా విఫలం అవుతూ వచ్చాడు. మిడిల్ ఆర్డర్‌లోనూ గత రెండు మ్యాచుల్లో ఆడలేకపోయాడు. నాలుగో టెస్టులో ఓపెనర్‌గానూ ఫెయిల్ అయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో అయితే కేవలం 3 పరుగులకే ఔట్ అయ్యాడు. బ్యాట్స్ మెన్ గానే కాదు అటు కెప్టెన్ గా కూడా రోహిత్ వ్యూహాలు విఫలమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ ఆటతీరుపై మాజీల నుంచో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక ఇప్పుడు నెటిజన్స్ కూడా రోహిత్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని, ఆయన స్థానంలో యంగ్ ప్లేయర్స్‌కు ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టింట వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే  ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఫామ్ లో లేని రోహిత్ శర్మ ను తీసేయాలనే డిమాండ్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో కెప్టెన్సీని బుమ్రాకు లేదా ఇతర ప్లేయర్‌కు అప్పగించడం ఉత్తమమనే సూచనలూ వస్తున్నాయి. ఈక్రమంలో సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ఆసీస్‌తో ఐదో టెస్టు జరగనుంది. ఈ టెస్ట్ లో అయినా హిట్ మ్యాన్ బాగా ఆడి ఫేమ్ లోకి వస్తే బాగుటుందని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు