"RIP GAUTAM GAMBHIR".. నెట్టింట ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్!

టీమిండియా కోచ్ గంభీర్‌పై రోహిత్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఐదో టెస్టు నుంచి రోహిత్‌ను తప్పించినట్లు వార్తలు రావడంతో "RIP GAUTAM GAMBHIR" అనే హ్యాష్‌ట్యా‌గ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్ వచ్చాకే టీమిండియాకు పరాజయాలు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు.

New Update
RIP GAUTAM GAMBHIR hashtag (1)

RIP GAUTAM GAMBHIR hashtag (1)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇటీవల జరిగిన నాలుగో టెస్టులో భారత స్టార్ ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో కెప్టె్న్ రోహిత్ శర్మ, కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వాలంటూ జోరుగా సోషల్ మీడియాలో రచ్చ నడిచింది. అంతేకాకుండా త్వరలో జరగనున్న ఐదో టెస్టు నుంచి రోహిత్ శర్మను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. 

ఇది కూడా చదవండి: న్యూ ఇయర్ విష్ చేసినందుకు విద్యార్థిని చంపేశారు!

దీంతో రోహిత్ ఫ్యాన్స్ టీమిండియా కోచ్ గంభీర్‌పై ఫైర్ అవుతున్నారు. "RIP GAUTAM GAMBHIR" అనే హ్యాష్ ట్యా‌గ్‌ను ట్విట్టర్ (ఎక్స్)లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ మేరకు వేలాది ట్వీట్లు చేస్తున్నారు. టెస్టుల్లో 2021 నుంచి అత్యధిక రన్స్ చేసింది రోహిత్ శర్మేనని.. ఇలా అవమానకరంగా తప్పించడం కరెక్ట్ కాదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. గంభీర్ వచ్చాకే టీమ్ ఇండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. ప్రస్తుతం గంభీర్ పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ నెట్టంట వైరల్ అవుతోంది. 

అయితే ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. దీంతో టీమిండియా కోచ్ గంభీర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ప్లేయర్లపై గుస్సైనట్లు తెలిసింది. ఈ మేరకు రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్ సహా ఇతర ప్లేయర్లపై ఫైర్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై గంభీర్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరిపైనా కోప్పడలేదని అన్నాడు. టీమ్‌లో ఉండేవారంతా చాలా బాగా ఆడే ప్లేయర్లేనని తెలిపాడు. అయితే ఒకానొక సమయంలో కొందరు విఫలం అవుతారని చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

రోహిత్ కంటే కోహ్లీ బెటర్..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఊహగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ మేరకు రోహిత్‌తో పోలిస్తే విరాట్ మైదానంలో చాలా చురుకుగా ఉండటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. కాగా ఈ సిరీస్ మొదటి టెస్టులో కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ కంటే కోహ్లీ బెటర్ అని, నాలుగో టెస్టులోనూ కింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలర్లకు సూచనలివ్వడంపై మెనేజ్ మెంట్ కూడా సానుకూలంగా స్పందించినట్లు బీసీసీఐ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ క్రమంలో చివరి టెస్టుకు విరాట్ సారథ్యంలో ఆడిస్తే బాగుటుందని భావిస్తున్నారట. రోహిత్ కు విశ్రాంతిని ఇచ్చి ఎలాగైనా చివరి టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం లేదంటే అతను తప్పుకోగానే  కోహ్లీ కే మళ్లీ సారథ్య బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment