/rtv/media/media_files/JBtmfATfa6j7UKvhbP0p.jpg)
R Ashwin: భారత్ స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రికార్డులు బద్ధలు కొట్టాడు. ఈ టెస్టు మ్యాచ్ లో 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 522 వికెట్లు తీయగా.. ఈ జాబితాలో మురళీధరన్ (800), వార్న్ (708), అండర్సన్ (704), కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), మెక్‌గ్రాత్ (563), లయన్ (530) అశ్విన్ కంటే ముందున్నారు. మరో 9 వికెట్లు పడగొడితే ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయన్‌ను దాటేస్తాడు అశ్విన్.
A game-changing TON 💯 & 6⃣ Wickets! 👌 👌
— BCCI (@BCCI) September 22, 2024
For his brilliant all-round show on his home ground, R Ashwin bags the Player of the Match award 👏 👏
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA #TeamIndia | #INDvBAN | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/Nj2yeCzkm8
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో చరిత్ర..
అంతేకాదు ఈ మ్యాచ్ లో అశ్విన్ మరో రికార్డును సొంం చేసుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. మొత్తం 11 సార్లు 5కు పైగా వికెట్లు తీశాడు. లయన్ (10), కమిన్స్ (8), బుమ్రా (7), హజిల్‌వుడ్ (6), సౌథీ (6) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యాష్ మరో రికార్డు నెలకొల్పాడు.
భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్లు..
అలాగే భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన పెద్ద వయస్కుడు అశ్విన్ కావడం విశేషం. కాగా అశ్విన్ వయసు 38 ఏళ్ల ఐదు రోజులు. 69 ఏళ్ల క్రితం విను మన్కడ్ నెలకొల్పిన ఈ రికార్డును చెరిపేశాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా యాష్ నిలిచాడు. 37 సార్లు అతడు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అశ్విన్ 101 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో ముత్తయ్యా మురళీధరన్ (67) తొలిస్థానంలో నిలిచాడు. షేన్ వార్న్ ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ తో భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు క్రియేట్ చేసిది. బంగ్లాదేశ్‌పై 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమ్‌ఇండియా ఇప్పటి వరకు 580 టెస్టుల్లో 179 విజయాలు సాధించింది.