/rtv/media/media_files/2025/04/28/K77ivFUWHMGpgxong0QE.jpg)
gt-vs-rr
ఐపీఎల్ 2025లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ గెలిస్తే ప్లేఆఫ్ బెర్తుకు చేరువవుతుంది. జట్టులోరాజస్థాన్ రెండు మార్పులు చేసింది ఫరూఖీ, దేశ్‌పాండే స్థానంలో తీక్షణ, యుధ్వీర్ చరక్ లకు చోటు కలిపించింది. గుజరాత్ తరుపున అఫ్గాన్ ఆల్ రౌండర్ కరీం జనత్ ఐపీఎల్ లో అరంగేట్రం చేస్తున్నాడు.
ఐపీఎల్‌లో గుజరాత్, రాజస్థాన్ జట్లు 7 సార్లు తలపడ్డాయి, వాటిలో 6 సార్లు గుజరాత్ గెలిచింది. ప్రస్తుతం, గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు (6 విజయాలు, 2 ఓటములు) మరియు +1.104 నికర రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం 4 పాయింట్లు మరియు -0.625 నికర రన్ రేట్‌తో 9వ స్థానంలో ఉంది.
Rajasthan Royals Have Won the toss and Have opted to field 🏏 #RRvsGT #GTvsRR l Sudarshan l Parag l Shubham Gill l Yashasvi Jaiswal l Jos Buttler 🔥 pic.twitter.com/DftrToxMua
— Pintu Dera (@pintudera_) April 28, 2025
జట్లు
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్.
గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కరీం జనత్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Also read : Siddaramaiah: ముఖ్యమంత్రి ఓవరాక్షన్.. స్టేజ్ మీదే IPS చెంపపై కొట్టబోయిన (VIRAL VIDEO)