PBKS vs MI: ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. టాప్ 1 స్థానం ఖరారు

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్ ఇంగ్లిస్ (73), ప్రియాంశ్‌ ఆర్య (62) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పంజాబ్ అగ్రస్థానానికి చేరుకుంది.

New Update
PBKS vs MI

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నేడు రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో 185 పరుగుల టార్గెట్‌తో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. మొదటి నుంచి అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 18.3 ఓవర్లకే గేమ్‌ను ముగించింది. 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

పంజాబ్ ఘన విజయం

తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయిపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పంజాబ్ తొలి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతానికి పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (73), ప్రియాంశ్‌ ఆర్య (62) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 13 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అదే సమయంలో వధేరా 2 పరుగులతో నాటౌట్‌గా క్రీజ్‌లో ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

జైపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ ముందు 185 టార్గెట్ ఉంది. ఓపెనర్లు రికెల్‌టన్ (27), రోహిత్ శర్మ (24) పర్వాలేదనిపించారు. 

ipl 2025 points table

ఇది కూడా చూడండి: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

దంచికొట్టిన సూర్యకుమార్

సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. అందులో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. అతడు అర్ధ శతకంతో అలరించాడు. హార్దిక్ పాండ్య (26), నమన్ ధీర్ (20), విల్ జాక్స్ (17) పరుగులు చేశారు. తిలక్ వర్మ (1) నిరాశపర్చాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్ 2 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, విజయ్‌కుమార్ వైశాఖ్‌ 2 వికెట్లు, హర్‌ప్రీత్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు. 

ఇది కూడా చూడండి: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

latest-telugu-news | PBKS vs MI

Advertisment
Advertisment
తాజా కథనాలు