Peter Moor : క్రికెట్కు అరుదైన క్రికెటర్ రిటైర్మెంట్.. రెండు దేశాల తరుపున ఆడి

అంతర్జాతీయ క్రికెట్ కు అరుదైన క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. 34 సంవత్సరాల వయసులో పీటర్ మూర్  క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు.  పీటర్ మూర్ జింబాబ్వేలోని హరారేలో ఫిబ్రవరి 2, 1991న జన్మించారు.

New Update
peter moor

అంతర్జాతీయ క్రికెట్ కు అరుదైన క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. 34 సంవత్సరాల వయసులో పీటర్ మూర్  క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు.  పీటర్ మూర్ జింబాబ్వేలోని హరారేలో ఫిబ్రవరి 2, 1991న జన్మించారు. 2014 నుంచి 2019వరకు జింబాబ్వే తరుపున ఆడాడు. నవంబర్ 2014లో మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా జింబాబ్వే తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.  ఆ దేశం తరుపున 49 వన్టేలు , 21 టీ 20లు, 8 టెస్టులు ఆడి 1700కు పైగా పరుగులు చేశాడు.  

 తన తండ్రివైపు నాన్నమ్మ ఐరిష్ మూలాలు ఉండటంతో పీటర్ కు  ఐరిష్ పాస్ పోర్ట్ పొందాడు. దీంతో  2022 అక్టోబరులో ఐర్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించారు.  ఐర్లాండ్ కు వలస వెళ్లి 7 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. ఐర్లాండ్ తరుపున  వన్డే వరల్డ్ కప్ ఆడాలన్న తన కోరిక తీరకుండానే వీడ్కొలు పలికాడు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.  బులవాయోలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్  మ్యాచ్ కావడం విశేషం. 

వన్డేల్లో 827 పరుగులు

జింబాబ్వే తరపున ఎనిమిది టెస్ట్‌లలో ఐదు అర్ధ సెంచరీలతో పీటర్ మూర్   వన్డేల్లో 827 పరుగులు , టీ20ల్లో 364 పరుగులు చేశాడు, ఇందులో అజేయంగా 92 పరుగులు కూడా ఉన్నాయి.  కానీ ఐర్లాండ్ తరపున ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. మొత్తం మీద, మూర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులకు దగ్గరగా చేశాడు.   రెండు వేర్వేరు దేశాల తరపున టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 17 మంది క్రికెటర్లలో ఒకరిగా మూర్ నిలిచాడు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు