/rtv/media/media_files/2025/01/13/sz90byt1oGFHsROokVg7.jpg)
icc Australia Photograph: (icc Australia)
ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 15మందితో కూడిన జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తారని వెల్లడించింది. ఆస్ట్రేలియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్. దక్షిణాఫ్రికా జట్లతో లాహోర్, రావల్పిండి వేదికలో జరుగుతాయి.
- 22 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
- 25 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, రావల్పిండి
- 28 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్, లాహోర్
Also Read : మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్
ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా
Our preliminary squad for the 2025 @ICC #ChampionsTrophy is here 🔥 pic.twitter.com/LK8T2wZwDr
— Cricket Australia (@CricketAus) January 13, 2025
బుమ్రా కోసం ఆలస్యం
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే పలుదేశాలు తమ జట్టులను ప్రకటించాయి. కానీ భారత్ ఇంకా ప్రకటించలేదు. దాదాపుగా 4 నుంచి5 వారాల ముందే జట్టులను ప్రకటించాలి. బుమ్రా లాంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండుతున్నారు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానంగానే అతడి విషయంలో క్లారిటీ రావడానికి మరింత టైమ్ పట్టే అవకాశం ఉంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు మరింత టైమ్ కావాలని ఐసీసీని బీసీసీఐ కోరవచ్చని తెలుస్తోంది. ఒకసారి జట్టును ప్రకటించాక మార్పులు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిపస్తుంది. మరి భారత సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.
Also Read : అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేసింది!
Also Read : IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!