IND vs PAK : తోకముడిచిన పాకిస్థాన్‌.. స్కోర్‌ ఎంతంటే?

ఆసియా కప్‌ 2025లో భాగంగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.  

New Update
india (1)

ఆసియా కప్‌ 2025లో భాగంగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127  పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టుకు హార్దిక్‌ పాండ్యా ఫస్ట్ ఓవర్ లోనే బిగ్ షాకిచ్చాడు. తొలి బంతికే ఓపెనర్‌ సయిమ్‌ అయూబ్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. అనంతరం జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి మహ్మద్‌ హారిస్‌ (3) వెనుదిరిగాడు. ఆరు పరుగుల వ్యవధిలోనే పాక్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. అనంతరం  ఫర్హాన్ (3), ఫకర్‌ జమాన్‌ (17) ఆచితూచి ఇన్సింగ్స్ ఆడారు.

ఫర్హాన్ ఒంటరి పోరాటం

వీరి జోడీకి అక్షర్‌ పటేల్‌ బ్రేక్ వేశాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి ఫకర్‌ జమాన్‌  వెనుదిరిగాడు. అనంతరం పాక్ ఆటగాళ్లు సల్మాన్‌ అఘా (3),  హసన్‌ నవాజ్‌ (5), మహ్మద్‌ నవాజ్‌ (0) త్వరగానే ఔటయ్యారు. వికెట్లు పడుతున్న సాహిబ్‌జాదా ఫర్హాన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. చివరకు కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  చివర్లో  షాహీన్ అఫ్రిది 4 సిక్సులతో చెలరేగడంతో పాక్ ఆ మాత్రం స్కోరు అయిన చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు,  హార్దిక్ పాండ్యా,వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. 

Advertisment
తాజా కథనాలు