PAK vs SL : శ్రీలంకతో మ్యాచ్... పాక్ ఫీల్డింగ్!

ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా  టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది.

New Update
pak vs sl

ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య అబుదాబిలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా  టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బ్యాటింగ్ చేయనుంది. గ్రూప్ దశలో పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో ముగించింది. సూపర్ 4లో ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమని చవిచూసింది. ఇక గ్రూప్ దశలో శ్రీలంక ఆడిన మూడు మ్యాచ్ లలో గెలిచింది. అయితే సూపర్ 4లో బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో టోర్నమెంట్‌లో తొలి ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ ఇప్పుడు ఇరు జట్లకు చాలా కీలకం అన్నమాట. 

జట్లు:

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కుసల్ పెరీరా, చరిత్ అసలంక(సి), దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషార

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

Advertisment
తాజా కథనాలు