India vs Pakistan : టాస్ గెలిచిన పాక్.. ఇండియా బ్యాటింగ్!

T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో  పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. 

New Update
india

T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో  పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఒకరినొకరు కనీసం చూసుకోలేదు. కరచాలనం కూడా చేసుకోలేదు. 

https://x.com/Ashsay_/status/2023022306478653485/photo/1

ఇక జట్ల విషయానికి వస్తే, టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మ తుది జట్టులోకి వచ్చారు. 

భారత జట్టు : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా


పాకిస్థాన్‌ జట్టు :  సయామ్ ఆయుబ్, సాహిబ్జాద ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్‌ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్

Advertisment
తాజా కథనాలు