/rtv/media/media_files/2025/09/14/ind-vs-pak-2025-09-14-18-52-19.jpg)
ఆసియా కప్ లో భాగంగా మరికాసేపట్లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది. రాత్రి 7:30 PMకి టాస్ వేస్తారు. ఇటీవలి పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ ఉగ్రదాడికి నిరసనగా, భారత జట్టు ఆటగాళ్లు నల్లటి చేతిపట్టీలు ధరించి మ్యాచ్ ఆడనున్నారు. ఇది జాతీయ దుఃఖం, అమరవీరులకు గౌరవం ప్రకటించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాయి. భారత జట్టు యుఏఈని, పాకిస్తాన్ జట్టు ఒమన్‌ను ఓడించాయి. భారత జట్టుకు బ్యాటింగ్ బలం ఎక్కువగా ఉండగా, పాకిస్తాన్ తమ బౌలింగ్‌పై ఆధారపడుతోంది. అయితే ఈ మ్యాచ్ కు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా ప్రోటోకాల్‌ల గురించి మరిన్ని వివరాలు -- జెండాలు, బ్యానర్లు, గొడుగులు, పెద్ద కెమెరాలు, సెల్ఫీ స్టిక్‌లు, మండే పదార్థాలు, పదునైన వస్తువులను స్టేడియంలోకి అనుమతించరు. వీటిలో దేనినైనా తీసుకెళ్లడం వల్ల రూ. లక్ష నుండి రూ. 7 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. హింసకు పాల్పడటం, వస్తువులను విసిరేయడం, జాత్యహంకార లేదా దుర్వినియోగ భాషను వాడటం వల్ల జైలు శిక్షకు విధించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు 16 సార్లు పోటీ
ఇక భారత్ తమ మొదటి మ్యాచ్‌లో యూఏఈని 9 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి, యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసింది. పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్‌లో ఒమన్‌పై 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వారి బ్యాటింగ్ , బౌలింగ్ రెండూ బలమైన ప్రదర్శన చేశాయి. భారత్ , పాకిస్తాన్ జట్లు ఆసియా కప్‌లో ఇప్పటి వరకు 16 సార్లు తలపడ్డాయి. ఈ రికార్డులలో భారత్ 9 సార్లు గెలవగా, పాకిస్తాన్ 6 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే, ప్రస్తుత ఫామ్, జట్ల బలం ఆధారంగా చూస్తే, ఇది ఇరు జట్ల మధ్య ఒక హోరాహోరీ పోరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం గ్రూప్ టాప్ పొజిషన్‌ను నిర్ణయించడంలో కీలకం కానుంది.