PAK vs NZ : బచ్చగాళ్ల ముందు కూడా చేతులెత్తేశారు.. పాకిస్తాన్ పరువు పోయిందిగా!

పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండవ వన్డేలో 84 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ ఓడింది. న్యూజిలాండ్ బీ టీమ్ ముందు కూడా పాక్ చేతులెత్తేయడంతో నెటిజన్లు ఆ జట్టును సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు.  

New Update
Pakistan loss series

Pakistan loss series

పాకిస్తాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకుంది.  293 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. పేలవమైన ప్రదర్శన చేసి 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఫహీం అష్రఫ్ (73), నసీమ్ షా(51) పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్  బెన్ సియర్స్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. 

అంతకుముందు న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. మిచెల్ హే(99) పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఏప్రిల్ 5, శనివారం రోజున  మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో జరుగనుంది. కాగా ఇప్పటికే పాకిస్తాన్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను కివీస్ దక్కించుకుంది.  స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా కివీస్ అదరగొట్టగా..  న్యూజిలాండ్ బీ టీమ్ ముందు కూడా పాక్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో నెటిజన్లు ఆ జట్టును సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు.  

పాకిస్తాన్ కు ఐసీసీ జరిమానా 

తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ను ఉల్లంఘించినందుకు జట్టుకు ఈ జరిమనా విధించింది ఐసీసీ.  ఆర్టికల్ 2.22 అనేది ఆటగాళ్ళు, ఆటగాళ్ల సహాయ సిబ్బందికి సంబంధించినది.  దీని ప్రకారం ఆటగాళ్లు తమ జట్టు నిర్ణీత సమయంలోపు బౌలింగ్ చేయని ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుంది.  

Rishabh Pant : పరువు తీస్తున్న పంత్.. రూ.27 కోట్ల పెట్టి కొంటే 17 పరుగులు!

Advertisment
తాజా కథనాలు