/rtv/media/media_files/2025/05/01/7XQEfrFZoAvWOFNKRKkP.jpg)
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ VS ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 218 టార్గెట్ ఉంది.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
Captain Rohit presenting Orange Cap to Surya Dada
— Radha (@Radha4565) May 1, 2025
Their Bond🫂❤️#RRvsMI pic.twitter.com/epTve95KSV
ఎవరెన్ని కొట్టారంటే?
ఓపెనర్లు రికెల్‌టన్ 38 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు ఉన్నాయి. అతడు కేవలం 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇక ఈ ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మంచి శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
🚨 Indian Premier League 2025, MI vs RR 🚨
— Sporcaster (@Sporcaster) May 1, 2025
A brilliant shot from Hardik Pandya #MIvRR #MIvsRR #RRvsMI #RRvMI #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Jaipur #OneFamily #MumbaiIndians #HallaBol #RajasthanRoyals #HardikPandya pic.twitter.com/f7ZH7Iiizz
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. హార్దిక్ పాండ్య 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో దంచికొట్టారు. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్, మహీశ్ తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
rr-vs-mi | latest-telugu-news | telugu-news