/rtv/media/media_files/2025/07/14/mi-new-yeak-2025-07-14-10-06-00.jpg)
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టైటిల్‌ను ఎంఐ న్యూయార్క్ కైవసం చేసుకుంది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌ను ఐదు పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డికాక్ 46 బంతుల్లో 77 పరుగులతో మెరిశాడు. వాషింగ్టన్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 3 వికెట్లు తీశాడు.
🏆 CHAMPIONS! MI New York hold their nerve in a thriller to win the #MLC2025 Final by 5 runs! 💙
— MBE Sport HQ (@MBESportHQ) July 14, 2025
Quinton de Kock's explosive 77(46) set the tone, but it was Rushil Ugarkar’s clutch 2/32 that sealed the deal! 🔥
📍 Grand Prairie Stadium witnessed a classic.#MINY |… pic.twitter.com/MBgMrSAGp2
12 పరుగులు అవసరం కావడంతో
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ , ఆండ్రీస్ గౌస్ ఇద్దరూ తొలి ఓవర్లలోనే డకౌట్‌లుగా వెనుదిరిగారు. రచిన్ రవీంద్ర 70, గ్లెన్ ఫిలిప్స్ 48* రన్స్ చేశారు. చివరి ఓవర్‌లో మాక్స్‌వెల్ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫ్రీడమ్‌కు చివరి ఆరు బంతుల్లో 12 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది.
న్యూయార్క్ బౌలర్లు మ్యాచ్ చేజారకుండా బంతులు వేశారు. న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, రుషిల్ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో 5 వికట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్ విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
Also Read : Sperm Count Tips: స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి.. వరదలా పారుతాయి!