Glenn Maxwell : నీ దరిద్రం ఏంటన్నా ఇట్లుంది.. పాపం ఔట్ కాకున్నా..!

పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ తొలి బంతికే  ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. సాయికిశోర్ వేసిన ఈ బంతి వికెట్లకు తగులుతున్నట్లుగా కనిపించడంతో అంపైర్ ఔట్ గా ఇచ్చాడు. తీరా చూస్తే ఆ బంతి స్టంప్స్ మిస్ అయినట్లుగా కనిపించింది.

New Update
max-punjab

max-punjab

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే  మ్యాక్స్‌వెల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వాస్తవానికి సాయికిశోర్ వేసిన ఈ బంతి వికెట్లకు తగులుతున్నట్లుగా కనిపించడంతో అంపైర్ ఔట్ గా ఇచ్చాడు.  అయితే మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకోకుండా వెళ్లిపోయాడు. తర్వాత చూస్తే ఆ బంతి స్టంప్స్ మిస్ అయినట్లుగా కనిపించింది. మ్యాక్స్‌వెల్ రివ్యూ తీసుకుంటే బాగుండేదని.. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా రివ్యూ తీసుకోమని చెబితే బాగుండేదని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.  

మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

ఈ డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక (19) సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్  తరువాత రోహిత్ శర్మ (18) తర్వాతి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్ లో మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరుపున కూడా ఇదే తరహా ఆటతీరు ఉండటంతో అతన్ని వదులుకుంది. పంజాబ్ అతన్ని రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రాంచేజీ మారిన మ్యాక్స్‌వెల్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సులున్నాయి.  ప్రస్తుతం పంజాబ్ 15 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  

Also Read :  Black And Green Grapes: నల్ల ద్రాక్ష, పచ్చని ద్రాక్షలో ఏది మంచిది.. ఏది ఆరోగ్యానికి ఉపయోగకరం?

Advertisment
తాజా కథనాలు