ఐపీఎల్ మెగా వేలం ఇటీవల ఉత్కంఠగా జరిగింది. ఈ వేలంలో టీమిండియా ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. కేకేఆర్ రూ.23.75 కోట్లకు వెంకటేశ్‌ను సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్ అయ్యార్‌కు క్రికెట్ అన్నా.. చదువు అన్నా చాలా ఇష్టం. ఈ రెండింటిలో వెంకటేశ్ చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! జాబ్ ఆఫర్ వద్దని క్రికెట్ వైపు అతడు 2018లో ఫైనాన్స్‌లో ఎంబీఏ సైతం కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరులోని డెలాయిట్ కంపెనీ నుంచి అదిరిపోయే శాలరీతో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ ఉద్యోగం చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం కష్టమని భావించి ఆ జాబ్ ఆఫర్‌ను వద్దనేశాడు. ఇక ఇటీవల ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడంతో అతడి పేరు మారు మోగిపోయింది. Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..! ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్ అయ్యర్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రికెటర్లు కేవలం క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం అవ్వకూడదన్నాడు. దాంతో పాటు సాధారణ పరిజ్ఞానం సంపాదించడం కోసం చదువుకోవాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే మంచిదని పేర్కొన్నాడు. Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు! ప్రస్తుతం తాను తన పీహెచ్‌డీ (ఫైనాన్స్) చేస్తున్నానని అన్నారు. దీంతో తరువాత నుంచి ఎవ్వరైనా డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పుకొచ్చాడు. తాను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని.. అందువల్ల కేవలం క్రికెట్ పై మాత్రమే ఫోకస్ పెడతానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరన్నాడు. కానీ తన పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నాడు. తాను బాగా చదవడంతో క్రికెట్‌లో రాణించాలని తన తల్లిదండ్రులు కోరుకున్నట్లు తెలిపాడు. Also Read: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! ఏ క్రికెటర్ అయినా 60 ఏళ్ల వరకు ఆడలేడు.. కానీ విద్య చనిపోయే వరకు మనతోనే ఉంటుందన్నాడు. జీవితంలో రాణించాలనుకుంటే బాగా చదువుకోవాలని.. అలా చేస్తేనే ఆటలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం అని పేర్కొన్నాడు. అయితే తానెప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడనని అన్నాడు. దాని వల్ల ఒత్తిడిపెరుగుతుందని తెలిపాడు. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి విద్య అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.