/rtv/media/media_files/2025/08/03/root-2025-08-03-21-14-20.jpg)
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు. లండన్‌లోని ఓవల్‌లో భారత్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు నాలుగో రోజున ఈ మైలురాయిని రూట్ చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఈ ఘనత సాధించాడు.
History made!
— Mudassir Khan (@Mudassirkhan090) August 3, 2025
Joe Root becomes the first batter to score 6000+ runs in World Test Championship history! 📖🔥
LEGEND STUFF.#JoeRoot#ENGvIND#WTC27pic.twitter.com/LJeFy2HNx4
ఆ తరువాతి స్థానాల్లో స్టీవ్ స్మిత్ 4,278 పరుగులతో, మార్నస్ లాబుషేన్ 4,225 పరుగులతో ఉన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రూట్ 20 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి. WTCలో భారత్‌పై రూట్ గణాంకాలు చాలా బాగున్నాయి. 19 మ్యాచ్‌ల్లో, అతను 60.64 సగటుతో 1885* పరుగులు చేశాడు. భారత్ పై అతని అత్యధిక స్కోరు 218. భారత్ తో జరుగుతోన్న సిరీస్‌లోనే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కూడా రూట్ రికార్డు సృష్టించారు.
ఇంగ్లాండ్ పట్టు
ఐదో టెస్టు నాలుగో రోజు ఆట ఇంగ్లాండ్ పట్టు సాధించింది. భారత బౌలర్లు మంచి ప్రారంభం ఇచ్చినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్ ను తమవైపు తిప్పుకున్నారు. జో రూట్ (98*), హ్యారీ బ్రూక్ (111) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బ్రూక్ కేవలం 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, దూకుడుగా ఆడాడు. మరోవైపు రూట్ నిలకడగా ఆడి సెంచరీకి చేరువయ్యారు. వీరిద్దరూ కలిసి దాదాపు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.