భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాను ‘మరుగుజ్జు’ అని బుమ్రా అనడంతో అది కాస్త వైరలై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మధ్య జరిగిన ఒక సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. జస్ప్రీత్ తన వ్యాఖ్యలకు టెంబాకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏం జరిగిందంటే..
Bumrah apologized to TEMBA BAVUMA
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ తొలి రోజు జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ వేయగా.. అది క్రీజ్‌లో ఉన్న బావుమా ప్యాడ్‌కు తగిలింది. దీంతో కీపర్ రిషబ్ పంత్‌తో DRS గురించి చర్చిస్తున్న సమయంలో బుమ్రా.. టెంబా బావుమాను మరుగుజ్జు అని పిలిచాడు. అది కాస్త వికెట్ల వద్ద ఉన్న మైక్‌లో రికార్డ్ అయింది. ఇదే వివాదానికి దారితీసింది.
అనంతరం తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా విజయం తర్వాత జస్ప్రీత్ బుమ్రా టెంబాకు క్షమాపణలు చెప్పినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జస్ప్రీత్ బుమ్రా.. బావుమా భుజంపై చేయి వేసుకుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత టెంబాతో హ్యాండ్ షేక్ కూడా చేశాడు. దీంతో బుమ్రా తన వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ టెంబాకు క్షమాపణలు చెప్పాడని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అద్భుతంగా రాణించాడు. జట్టు వెనుకబడినప్పుడు.. బావుమా అర్ధ సెంచరీ చేశాడు. అతను, కార్బిన్ బాష్ 44 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. చివరికి స్వదేశంలోనే టీమిండియాను ఓడించి.. దక్షిణాఫ్రికా 15 సంవత్సరాల తర్వాత భారతదేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
Jasprit Bumrah: 'మరగుజ్జు' వివాదం.. బావుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! (వీడియో)
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాను ‘మరుగుజ్జు’ అని బుమ్రా అనడంతో అది కాస్త వైరలై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి.
Jasprit Bumrah sorry to TEMBA BAVUMA