/rtv/media/media_files/2025/09/14/india-vs-pak-2025-09-14-07-29-00.jpg)
India-Pakistan Match
ఏ టోర్నీ అయినా.. వేదిక ఎక్కడైనా.. ఏ ఫార్మాట్ అయినా సరే.. భారత్, పాక్ మ్యాచ్ అవుతూందంటే...అందరి కళ్ళూ దాని మీదనే ఉంటాయి. ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ మూమెంట్ వచ్చింది. ఆసియా కప్ లో భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ కోసం అందరూ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. పహల్గాందాడి..భారత్, పాకిస్తాన్ వార్...దాని తర్వాత రెండు దేశాల మధ్యా వైరం.. ఇద్దరి మధ్యా మ్యాచ్ జరగకూడదన్న వాదనలు..ఇన్నింటిమధ్యా ఫైనల్ గా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ కారణంగా ఈరోజు జరగనున్న ఇండియా, పాక్ మ్యాచ్ అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఎవరు గెలుస్తారు అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మూములుగానే ఇండియా, పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ భారత్ గెలవాలని ఎక్కువ మంది కోరుకుంటారు. రెండు టీమ్ ల మధ్య మ్యాచ్ లా కాకుండా.. రెండు దేశాల మధ్య పోరులా జరుగుతుంది. ఇప్పుడు విభిన్న పరిస్థితుల మధ్య జరగుతున్న ఆసియా కప్ మ్యాచ్ లో కూడా చాలా మంది భారతే గెలవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా ఉన్న ఊపులో ఆ దేశాన్ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని కూడా అంచనాలున్నాయి. కానీ అటు పాకిస్తాన్ కు కూడా ఎప్పుడూ భారత్ మీద గెలవాలనే కోరుకుంటుంది. మన దేశానికి టఫ్ ఫైట్ ఇవ్వాలని అనుకుంటోంది. దాని కోసం చాలా కష్టపడి ప్రాక్టీస్ కూడా చేస్తోంది. తాము అంత తేలికగా లొంగమని సంకేతాలు కూడా ఇచ్చింది ఆ జట్టు.
ఇప్పటి వరకు ఏకపక్షంగా..
ఇప్పటి వరకు ఆసియా కప్ లో కొన్ని మ్యాచ్ లు జరిగాయి. కానీ అన్నీ ఏకపక్షంగా సాగాయి. భారత్, యూఏఈ మ్యాచ్ అయితే అసలు అది ఒక మ్యాచేనాఅన్నట్టు అయింది. అలాగే పాకిస్తాన్ కూడా ఒమన్ పై ఘన విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ కంటే భారత్ మంచి ఊపులో ఉంది.టీ20లో ఎదురులేని టీమ్ గా కొనసాగుతోంది. టీ20 వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచిన దగ్గర నుంచీ టీమ్ ఇండియా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. లాస్ట్ ఇయర్ మొత్తం 28 మ్యాచ్ లు ఆడితే కేవలం మూడు మాత్రమే ఓడింది. ఆసియా కప్ తొలి పోరులోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ప్రపంచకప్పుల్లో పాక్‌పై భారత్‌కు అద్భుత రికార్డుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్...ఇండియాకు పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే టీమ్ ఇండియాపై మ్యాచ్ అనగానే ఆ టీమ్ కు ఎక్కడ లేని శక్తీ వచ్చేస్తుంది. అందుకే మన జట్టు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతుంది వాళ్ళతో.
స్పిన్ మీదనే ఆధారపడి..
భారత జట్టు బలం విషయానికి వస్తే..బ్యాటర్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ సూర్య కుమార్, శుభ్ మన్ గిల్, సంజుశాంసన్, శివమ్దూబె అందరూ మంచి ట్రాక్ రికార్డ్ లతో ఆడడానికి రెడీ గా ఉన్నారు. వీరికి హార్దిక్, అక్షర్ పటేల్ అదనపు బలం ఇస్తున్నారు. అయితే దుబాయ్ లో ఎప్పుడూ స్పిన్నర్లదే ఆధిపత్యం. ముందు జరిగిన మ్యాచ్ లను బట్టి ఇక్కడ బంతి బాగా తిరుగుతోంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా స్పిన్ బౌలింగే ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. మరోవైపు భారత్, పాక్ రెండు టీమ్ లూ బలమైన స్పిన్ విభాగాలు కలిగి ఉంది. భారత్‌కు కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌ల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నారు. తొలి మ్యాచ్‌లో ఈ ముగ్గురూ సత్తా చాటారు. ముఖ్యంగా కుల్‌దీప్ 4 వికెట్లతో యూఏఈ పతనాన్ని శాసించాడు. ఇక పాకిస్థాన్‌కు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముఖీమ్ల రూపంలో ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లకు తోడు సయీమ్ అయూబ్ రూపంలో అక్షర్ తరహా స్పిన్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నాడు. ముగ్గురూ ప్రతిభావంతులే. ఫామ్‌లోనూ ఉన్నారు. కాబట్టి ఇరు టీమ్ ల మధ్య మ్యాచ్ బలంగా సాగే అవకాశం ఉంది.