Ishan Kishan : ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా.. !

ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్  బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. రాజస్థాన్ పై సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.  

New Update
ishan century

రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న తొలి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పలు రికార్డులు సృష్టించింది. ఐపీఎల్‌లో పవర్‌ప్లే అత్యధిక  స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. పవర్ ప్లేలో హైదరాబాద్  ఆటగాళ్లు ఏకంగా  90 పరుగుల మార్క్ ను దాటేశారు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 100 పరుగులు చేసిన జట్టుగా కూడా సన్‌రైజర్స్  నిలిచింది. 6.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 100 పరుగుల మార్కును దాటింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్ర లోనే ఇదే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా కూడా సన్‌రైజర్స్ నిలిచింది.

ఇక మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్‌రైజర్స్  బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అంతేకాకుండా , ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.  అంతకుముందు ఈ రికార్డు మనీష్ పాండేపై ఉండేది. 

Also Read :  సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన రికార్డు...IPL చరిత్రలోనే!

Also read :  నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!

బౌలర్లకు చుక్కలు చూపించారు

టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లకు సన్‌రైజర్స్ బ్యాట్స్ మెన్స్ చుక్కలు చూపించారు.  ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది సన్రైజర్స్. ట్రావిస్ హెడ్ (679 ఫోర్లు, 3 సిక్స్‌)లతో విధ్వంసం సృష్టించగా..  ఇషాన్ కిషన్ (106*11 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు.హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్‌ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు తీయగా, మహీష్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also read :  రూ.12 కోట్లు బొక్కా.. ఇదేం బౌలింగ్రా అయ్యా.. జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు