IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ నిలవబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుండగా.. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలోకి వదిలేస్తే అతడిని దక్కించుకోవడానికి ఫ్రాంఛైజీలు పోటీపడతాయని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడుతున్నాడు. రిషబ్ కోసం ఏకంగా రూ. 30 కోట్ల వరకూ వెచ్చించే అవకాశం ఉందంటున్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే?
భారీ ధరకు అమ్ముడవుతాడు..
ఈ మేరకు చోప్రా మాట్లాడుతూ.. ‘రిషభ్ పంత్ మెగా వేలానికి అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. అతను కీపర్-బ్యాటర్. టీ20ల్లో పంత్ గణాంకాలు బాగా లేవంటున్నారు. కానీ, పంత్ వేలంలోకి వస్తే భారీ ధరకు అమ్ముడవుతాడని పక్కాగా చెప్పగలను. ఆర్సీబీకి ఒక వికెట్‌కీపర్, బ్యాటర్, కెప్టెన్ కూడా కావాలి. పంజాబ్, కోల్‌కతా, చెన్నై టీమ్‌లకు పంత్ అవసరం ఉంది. ఢిల్లీ అతడిని తిరిగి దక్కించుకోవాలంటే ఆర్‌టీఎం కార్డు అందుబాటులో ఉంటుంది. ఇషాన్ కిషన్‌ను వదులుకుంటే ముంబైకి పంత్ కావాలి. లఖ్‌నవూ నికోలస్ పూరన్‌ని రిటైన్ చేసుకున్నా పంత్‌పై ఆసక్తి చూపుతుంది. రాజస్థాన్, గుజరాత్‌తో పాటు అన్ని జట్లకు అతని అవసరం ఉంది. కావున రిషబ్ రూ. 25-30 కోట్లు దక్కించుకునే అవకాశం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: ఓరి దుర్మార్గుడా.. కుక్క తోకకు పటాకులు కట్టి ఏం చేశాడో చూడండి